బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ హ్యాక్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. సైబర్ నేరగాళ్లు ఉక్రెయిన్ల కోసం క్రిప్టోకరెన్సీ విరాళాలు కోరుతూ ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. దీంతో తాను ఎలాంటి విరాళాలు సేకరించడంలేదని, తన అకౌంట్ హ్యాకింగ్ అయినట్లు నడ్డా ప్రకటించారు. అయితే కొద్దిసేపటికే ట్విట్టర్ ఖాతాను మళ్లీ పునరుద్ధరించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.