ప్రెట్టి బాయ్ ఫ్లాయిడ్.. ఇతడో మంచి దొంగ
పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు ప్రెట్టి బాయ్ ఫ్లాయిడ్. అమెరికాకు చెందిన ఇతడు దొంగతనాలు చేసినా మంచి దొంగగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1920 సంవత్సరంలో ఎన్నో బ్యాంకులను కొల్లగొట్టిన ఫ్లాయిడ్.. దొంగతనం చేసిన ప్రతి బ్యాంకులో ఎంతోమంది పేదలకు సంబంధించిన రుణ పత్రాలను కాల్చేసేవాడు. దొంగ అయినా ఆరోజుల్లోనే ఎంతోమందికి రుణమాఫీ చేసాడు. అందుకే ఇతని అంత్యక్రియల్లో కొన్నివేల మంది పాల్గొని సంతాపం తెలిపారు.