ఇషాన్ కిషన్‌కు గాయం, మూడో టీ20కి డౌట్
టీమిండియాను గాయాల బెడద వీడట్లేదు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయపడగా.. తాజాగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తలకు గాయమైంది. వెంటనే ఫిజియో వచ్చి అతడిని పరిశీలించారు. ఆ తర్వాత అతడిని హాస్పిటల్‌కు తరలించి తలకు స్కానింగ్ తీశారు. దీని ఫలితం రావడానికి కాస్త సమయం పట్టనుంది. దీంతో ఇవాళ జరిగే మూడో టీ20 మ్యాచ్‌కు అతడు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.